హీరోయిన్ కాక‌ముందు న‌య‌న‌తార కూడా అదే చేసింది..!

0

సౌత్ ఇండియాన టాప్ హీరోయిన్ల‌లో ఇప్పుడు న‌య‌న‌తార పేరు ముందు వ‌రుస‌లో ఉంది. అటు త‌మిళం, ఇటు తెలుగులో ఆమెకు వ‌రుస హిట్స్ ద‌క్కుతున్నాయి. పైగా మ‌ళ‌యాళంలోనూ ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. దాంతో ప‌ర్స‌న‌ల్ లైఫ్ తో సంబంధం లేకుండానే ఈ భామ‌కు ప్రేక్ష‌కులు హార‌తులు ప‌డుతున్నారు.

అయితే తాజాగా న‌య‌న‌తార‌కు సంబంధించిన ఓ పాత వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడ‌ది వైర‌ల్ అవుతోంది. డయానా మరియన్ కురియం అనే పేరుతో ఇప్పటి లేడీ సూపర్‌స్టార్ నయనతార త‌న‌ కెరీర్ ఆరంభంలో మాతృభాష మలయాళంలో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. మలయాళంలో చేసిన తొలి సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టీవీ యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా కూడా నయన్ పనిచేసింది.

అప్పటి వీడియోలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మలయాళంలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమపై నయన్ దృష్టి సారించింది. చంద్రముఖి, గజినీ వంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఇటీవ‌ల టాలీవుడ్ హిట్ మువీ సైరాలో కూడా చిరంజీవి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here