టీడీపీలో అజ్నాతవాసులు

0

అధికారంలో ఉండగా అంతా తామే అన్నట్టుగా వ్యవహరించిన నేతలకు గడ్డు కాలం ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఇప్పుడు అజ్నాతాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలు తెరమరుగు కావడం ఆసక్తి రేపుతోంది.

శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా వ్యవహరించిన కూన రవికుమార్ ఇప్పటికే వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తురాలి పట్ల దురుసుగా ప్రవర్తించి నోటికి పనిచెప్పిన కేసులో ఆయన ఇరుక్కున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ కూడా చిక్కుల్లో ఉన్నారు. పాత కేసులన్నీ తవ్వితీస్తున్న తరుణంలో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు దాఖలయ్యి ఉండడంతో చింతమనేని ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. దాంతో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన కూడా అజ్నాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా ఎన్నో సమస్యల్లో ఉన్నారు. మైనింగ్ మాఫియా వ్యవహారాలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. సీబీఐ విచారణకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఆయన కూడా తననుతాను కాపాడుకునే యత్నంలో ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా తలదాచుకుంటున్నట్టు చెబుతున్నారు.

వారితో పాటుగా కేసుల్లో ఉన్న కోడెల, సోమిరెడ్డి సహా పలువురు కీలక నేతలకు కూడా తలనొప్పులు తప్పేలా లేదు. ఇక దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు కూడా తదుపరి జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన సుమారు డజను మంది కార్యకర్తలు కూడా ఇప్పటికే కటకటాల్లో ఉన్నారు. దాంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఇదో పెద్ద తలనొప్పుిగా మారింది. కేసుల నుంచి కోలుకోవడం ఎలా అన్నది అంతుబట్టని వ్యవహారంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here