అయ్యో.. ఆంధ్రజ్యోతి ‘బోల్తా’ పడింది!

0

తెలుగునాట ఆంధ్రజ్యోతి పత్రిక తీరు వేరుగా ఉంటుంది. కాస్త దూకుడుగా ఉంటూ తమ యాజమాన్యానికి గిట్టని వారి తీరు పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా అంతకుముందు జగన్, ఇటీవల మోడీ వ్యతిరేకతను సంతరించుకున్న ఆంధ్రజ్యోతి అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది.

ఇటీవల చంద్రయాన్ 2 ప్రయోగం గురించి ఆ పత్రిక రాతల పట్ల పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విక్రమ్ బోల్తా అంటూ సెప్టెంబర్ 8 నాటి సంచికలో వచ్చిన హెడ్ లైన్స్ పట్ల సోషల్ మీడియాలు పలు విమర్శలు వచ్చాయి. దాంతో పాటుగా దాదాపుగా చేజారిపోయిందని భావించిన విక్రమ్ ఆచూకీ మళ్లీ లభించడంతో ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ వివాదాస్పదం అయ్యింది.

ఈ నేపథ్యంలోనే సంస్థ స్పందించింది. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పాఠకులు సహ్రుదయంతో అర్థం చేసుకోవాలంటూ విజ్ణప్తి చేసింది. అయితే వివరణలో కూడా తమకు ఇస్రోలోని ఓ శాస్త్రవేత్త అందించిన సమాచారం మేరకు అంటూ పేర్కొనడం కొత్త సందేహాలకు తావిస్తోంది. దేశంలో కీలకమయిన ప్రయోగం గురించి ఎవరో ఒక శాస్త్రవేత్త సదరు సంస్థకు ఎలా సమాచారం ఇస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాంతో ఆంధ్రజ్యోతి మరోసారి బోల్తా పడిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

గతంలో చంద్రయాన్ ప్రయోగం విషయంలో వాయిదా పడిన విషయం గుర్తించకుండా నింగిలోకి దూసుకెళ్లిందంటూ రాసి అప్పట్లో అభాసుపాలయ్యింది. ఇక ఇప్పుడు చంద్రుడి కి అతి చేరువలో జరిగిన పరిణామాలతో చివరకు ఇలా అయ్యింది. మొత్తంగా చంద్రయాన్ ప్రయోగం ఆంధ్రజ్యోతి పరువు తీస్తున్నట్టుగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here