చింతమనేని చిక్కుతాడా?

0

అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేల లిస్టులో ముందు వరుసలో నిలిచిన ఈ టీడీపీ నేత ఇప్పుడు మాజీగా మారిన తర్వాత కూడా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. రాజకీయ నేతగా రాణించాలంటే ఏదో ఒక ప్రచారం అవసరం అనే విషయం ఆయన బాగా వంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పలు వివాదాలతో ప్రముఖంగా ఆయన నిలిస్తే ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక కేసులతో కలకలం రేపుతున్నారు.

ఇప్పటికే పది రోజులుగా చింతమనేని ప్రభాకర్ ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయన గ్రామంలో బందోబస్తు కొనసాగుతోంది. ఆయన మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం పలువురు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఉన్న పాత కేసులకు తోడుగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో చింతమనేని అరెస్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

పోలీసులు ఎంతగా ప్రయత్నించినా చింతమనేని ప్రభాకర్ మాత్రం ఇప్పటి వరకూ పోలీసులకు చిక్కలేదు. తాజాగా ఆయన కోల్ కతాలో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్టు కథనాలు వస్తున్నాయి. అక్కడే అరెస్ట్ చేసి ఉంటారని కొన్ని పత్రికల్లో ఊహాగానాలు కూడా రాశారు. దాంతో చింతమనేని వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

పోలీసులలో కొందరు చింతమనేనికి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఆయన పోలీసులకు చిక్కకుండా సహకరిస్తున్నారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఇద్దరు పోలీస్ అధికారులను సస్ఫెండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఈ మాజీ ఎమ్మెల్యే ఆచూకీ కనిపెట్టగలరా లేదా అనే ఆసక్తికర చర్చ సర్వత్రా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here