టీమిండియా స్టార్ బౌలర్ మహ్మాద్ షమీకి ఉపశమనం దక్కింది. అరెస్ట్ వారంట్ పై స్టే విధిస్తూ తాజాాగా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బంగలోని అలీపోర్ కోర్ట్ ఈమేరకు తీర్పు వెలువరించింది. దాంతో భార్యతో వివాదం నేపథ్యంలో చిక్కుల్లో పడ్డ మహమద్ షమీకి కొంత రిలీఫ్ దక్కినట్టేనని చెప్పవచ్చు.
తన భార్యతో వైవాహిక సంబంధాలు దెబ్బతిన్న తర్వాత షమీ తీవ్రంగా సమస్యల్లో ఇరుక్కున్నారు. విడాకుల విషయంలో కోర్ట్ కి కూడా కేసు వెళ్లిన తరుణంలో తనను వేధిస్తున్నారంటూ భార్య ఆరోపించడం కలకలం రేపింది. చివరకు ఈ కేసులో కోర్ట్ కి సక్రమంగా హాజరుకావడం లేదంటూ అరెస్ట్ వారంట్ జారీ అయ్యింది. దానిపై తాజాగా స్టే విధించారు.
షమీ ఇటీవల విండీస్ పర్యటనలో విశేషంగా రాణించారు