కోటంరెడ్డి అరెస్ట్ కి వైసీపీ ఎమ్మెల్యేనే కార‌ణం…!

0

అధికార వైఎస్సార్సీపీలో విబేధాలు రోడ్డెక్కాయి. ఈసారి ఏకంగా క‌ట‌క‌టాల వెన‌క్కి కూడా మ‌ళ్లాయి. ఏపీలో చాలాకాలం త‌ర్వాత ఓ పాల‌క‌ప‌క్ష ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో వ‌న‌జాక్షి, ఐపీఎస్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారి వ్య‌వ‌హారాలు వెలుగు చూసినా నాటి ప్ర‌భుత్వం బాధితుల‌నే బాధ్యులుగా చేసింది. కానీ దానికి భిన్నంగా జ‌గ‌న్ ఆదేశాల‌తో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

ఎంపీడీవోని బెదిరించి, ఆమె ఇంటిపై దాడికి పాల్ప‌డిన కేసులో కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు. అయితే నెల్లూరు వైసీపీలో విబేధాలే ఈ వ్య‌వ‌హారానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. గ‌తంలో జ‌మీన్ రైతు ప‌త్రిక విలేక‌రిపై నోరుపారేసుకుని వివాదాల‌కెక్కిన కోటంరెడ్డిని ఇప్పుడు వైసీపీలో చింత‌మ‌నేనిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. అయితే ఆయ‌న మాత్రం త‌న అరెస్ట్ కి కార‌ణం వైసీపీ నేత‌లే అని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో త‌న‌ను ప‌క్క‌కు త‌ప్పించాల‌ని కొంద‌రు వైసీపీ నేత‌లే ప్ర‌య‌త్నిస్తున్నారంటూ శ్రీధ‌ర్ రెడ్డి ఆరోపించ‌డం ఆస‌క్తిని రాజేస్తోంది. ముఖ్యంగా కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి మీద ఆయ‌న గురిపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎంపీడీవో వెనుక ఉండి వైసీపీ నేత‌లు న‌డుపుతున్న నాట‌కానికి తాను బ‌ల‌య్యాయ‌ని, విచార‌ణ‌లో వాస్త‌వాలు తెలుస్తాయ‌ని ఆయ‌న అంటున్నారు. దాంతో వైసీపీలో విబేధాలు తార‌స్థాయికి చేరుకున్న తీరు స్ప‌ష్టం అవుతోంది. ఆపార్టీ అధినేత‌కు ఆ ప‌రిణామాలు పెద్ద త‌ల‌నొప్పిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here