RRR అలా ఖాయం చేసిన‌ట్టేనా!

0
46

బాహుబ‌లి వంటి బ‌డా సినిమాల త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న సినిమా సంచ‌ల‌నంగా మార‌బోతోంది. అందులోనూ ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో య‌మా ఇమేజ్ క‌నిపిస్తోంది. వ‌చ్చే జూలైలో విడుద‌ల కాబోతున్న సినిమాకు సంబంధించి చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

సినిమా టైటిల్ నుంచే ప‌లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. RRR అనేది కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్ గా ఇప్ప‌టికే సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ ఆ మూడు అక్ష‌రాల‌కు అనుగుణంగా టైటిల్ ఖ‌రారు కాబోతున్న‌ట్టు స‌మాచారం.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది.ఇప్ప‌టికే ఈ సినిమాకు మంచి టైటిల్‌ను కూడా సూచించాల‌ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌ను కోరింది. చాలా మంది RRRకు స‌రిపోయేలా చాలా ర‌కాల టైటిల్స్‌ను చెప్పారు. తాజాగా ఈ సినిమాకు రామ‌రౌద్ర రుషితం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌క్షిణాదిన రామ‌రౌద్ర రుషితం అనే టైటిల్‌ను.. ఇత‌ర భాష‌ల్లో రైజ్ రివోల్ట్ రివేంజ్‌ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే టైటిల్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని యూనిట్ చెబుతోంది. ఈలోగా అభిమానుల్లో మాత్రం ప‌లు టైటిల్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here