Top List: ఈ ద‌శాబ్ద‌పు మేటి యాప్స్ ఇవే!

    0

    వ‌ర్త‌మాన స‌మాజంలో సోషల్‌ మీడియాదే కీల‌క‌పాత్ర‌. ఈ విష‌యం మ‌రోసారి రుజువ‌య్యింది. ఈ ద‌శాబ్ద‌కాలంలో అత్య‌ధిక‌మంది డౌన్ లోడ్ చేసిన జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లోనూ సోష‌ల్ మీడియా యాప్స్ ఉన్నాయి. అందులోనూ ఒకే యాజ‌మాన్యానికి చెందిన ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజ‌ర్ మొద‌టి స్థానాల్లో నిల‌వ‌డం విశేషం.

    ఆ త‌ర్వాత గూగుల్ పే, ఫోన్ పే నిల‌వ‌గా త‌ర్వాతి స్థానాల్లో అత్య‌ధికంగా సోష‌ల్ మీడియా యాప్స్ ఉండ‌డం విశేషం. టాప్ 10లో వాటిదే హ‌వాగా క‌నిపించ‌డం గ‌మ‌నిస్తే ట్రెండ్ ఎలా ఉందో అర్థమ‌వుతోంది

    ఇక 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన చేసిన లిస్టులో ఫేస్ బుక్ కి మ‌ధ్య‌లో కొంత భ‌ద్ర‌తా కార‌ణాలు, కేంబ్రిడ్జ్ ఎన‌లైటికా వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా ముందంజ‌లో నిల‌వ‌డం విశేషం. డిజిటల్‌ స్పేస్‌లో టాప్ లిస్టులో ఉన్న జాబితాను యానీ సంస్థ వెల్ల‌డించింది. వారి వివ‌రాల ప్ర‌కారం జాబితా ఇలా ఉంది..

    యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌:

    • ఫేస్‌బుక్‌
    • ఫేస్‌బుక్‌ మెసేంజర్‌
    • గూగుల్ పే, ఫోన్ పే
    • వాట్సాప్‌
    • యూసీ బ్రౌజర్
    • ఇన్‌స్టాగ్రామ్‌
    • స్నాప్‌చాట్‌
    • టిక్‌టాక్‌
    • యూట్యూబ్‌
    • ట్విటర్‌

    భవిష్యత్తులో ఆన్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని జాబితాలు రూపొందిస్తామని యాప్‌ యానీ సంస్థ పేర్కొంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here